KMM: పెనుబల్లి మండలం పులిగుండాలను ప్రముఖ ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం MLA రాగమయితో కలిసి ప్రాజెక్టును సందర్శించిన వారు, నూతన కాటేజీలో అధికారులతో సమీక్షించారు. పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని అధికారులను ఆదేశించారు.