ఖమ్మం నగరంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్’ నిర్మించుకుందామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవార ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని జర్నలిస్టులు కలిసి వినతి పత్రం అందించారు. నియోజక వర్గ కేంద్రాల్లో అధునాతన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని, ఖమ్మం జిల్లా అక్రిడేషన్ కమిటీలో WJI ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.