NLG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రేడ్-1, 2, 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగు ఆయన హాజరయ్యారు. నిబంధనల ప్రకారమే అర్హులైన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను నిర్వహిస్తామన్నారు.