BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తారని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.