MBNR: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం వైద్య విద్యార్థి లోకేష్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థిని ఆకాంక్షించారు.