MLG: జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. జనరల్ విభాగంలో 71.31%తో రాష్ట్రంలో 5వ స్థానం, వొకేషనల్ విభాగంలో 70.19%తో 2వ స్థానం సాధించారు. ఇందులో బాలురు (Gen) 58.75% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 82.03% ఆధిపత్యం చాటారు. బాలురు (వొకేషనల్) 62.32% సాధించగా, బాలికలు 74.10% సాధించారు.