PDPL: ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని BRS పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఈరోజు ఆయన మాట్లాడారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేశారని, కోర్టు తీర్పుతో సత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇకనైనా అబద్ధాలు మానుకుని ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలన్నారు.