HNK: కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. భోజన విరామ సమయంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మహిళా సర్పంచులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ‘సెల్ఫీ ప్లీజ్’ అంటూ వారితో కలిసి ఫొటో దిగి సందడి చేశారు. ఉన్నతాధికారి హోదాలో ఉన్న కలెక్టర్, తమతో కలిసి సరదాగా ఫొటోలు దిగడం పట్ల మహిళా సర్పంచులు ఆనందం వ్యక్తం చేశారు.