MNCL: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ ఉద్యోగులకు రూ. 1 కోటి బీమా సదుపాయం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జీతాలను 010 పద్దు ద్వారా చెల్లిస్తూ ప్రత్యేక డైరెక్టరేట్‌ను మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.