ADB: గత దిశ సమావేశంలో చర్చించిన వాటిలో కొన్ని పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టామని తెలిపారు.