KNR: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం చిగురుమామిడి మండలం పీచుపల్లి, లంబాడిపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో పరిశీలించారు.