BHNG: లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ. 5,13,260, కార్ పార్కింగ్తో రూ.1,70,000, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,00,800, ప్రధాన బుకింగ్ రూ.82,800, వ్రతాలతో రూ.68,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.12,58,927 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.