»Tomorrows Second Odi Match Varunas Interference In Vizag
Second Odi match : రేపే రెండో వన్డే మ్యాచ్..వైజాగ్ లో వరుణుడి ఆటంకం?
టీమిండియా, (Team India) ఆసీస్ జట్ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో (Visakhapatnam )జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.
టీమిండియా, (Team India) ఆసీస్ జట్ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ పై ఫోకస్ చేసింది. రెండో వన్డే మ్యాచ్ రేపు (మార్చి 19) విశాఖపట్నంలో (Visakhapatnam )జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. డే అండ్ నైట్ (Day and Night) మ్యాచ్ కావడంతో ఇప్పటికే టిక్కెట్లన్నీ ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో అమ్ముడుపోయాయి. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) కూడా పునరాగమనం చేయనున్నాడు.
అయితే, మ్యాచ్ జరిగే రోజు విశాఖలో భారీ వర్షం(heavy rain) పడే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత జట్టు ఇప్పటివరకు వరుసగా ఏడు వన్డేలను గెలుచుకుంది. వాతావరణ సూచన అందరిలో ఆందోళనను పెంచింది. ఇప్పుడు దీని ప్రకారం రెండో వన్డేలో వర్షం విలన్‌గా మారితే టీమిండియా విజయ రథం ఇక్కడితో ఆగిపోవచ్చు. వైజాగ్ (Vizag )లో ఆదివారం దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. పగటిపూట భారీ వర్షం కురిస్తే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నంలోని ఈ మైదానంలో డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉంది. కొన్ని గంటలు మాత్రమే వర్షం పడితే, నేల ఎండిన తర్వాత ఆట ప్రారంభించవచ్చు. కానీ ఎక్కువసేపు వర్షం కురిస్తే మ్యాచ్‌పై ప్రభావం చూపుతుంది.