చిత్తూరులో జరిగిన ఫోటో & వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటో & వీడియో గ్రాఫర్లకు ఐడి కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ పత్రాలను పంపిణీ చేశారు. అలాగే అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.