పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ T20 క్రికెట్(ఇంటర్నేషనల్+లీగ్)లో రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 12వేల రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ 343 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా.. బాబర్ 338 ఇన్నింగ్సుల్లోనే బ్రేక్ చేశాడు. PSLలో పెషావర్ జల్మీకి ఆడుతున్న బాబర్ కరాచీ కింగ్స్‌పై 87 రన్స్ చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఇక 360 ఇన్నింగ్స్‌తో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.