‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో యాడ్స్ చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టి.. రూ.కోట్లు ఆఫర్ చేశాయని తెలిపాడు. అయితే, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది కావనే ఉద్దేశంతో పవన్ వాటిని తిరస్కరించారని చెప్పాడు.