వాంఖడే వేదికగా ముంబైతో మ్యాచ్లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. IPLలో ముంబైపై 1000+ పరుగులు చేసిన ఏకైక & తొలి ఆటగాడిగా అవతరించాడు. ఓవరాల్గా కోహ్లీ తర్వాత 977 పరుగులతో KL రాహుల్ 2వ స్థానంలో ఉన్నాడు. కాగా కోహ్లీ గతంలోనే చెన్నై, పంజాబ్, ఢిల్లీ జట్లపై 1000+ పరుగులు చేశాడు.