భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా, ఈ మ్యాచ్ టికెట్ల ధరలను PCA ప్రకటించింది. టికెట్ ధర రూ. 250 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 10,000 వరకు ఉండనుంది. అయితే, ఈ మ్యాచ్ టికెట్ ఐదు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.