»Bangladesh Won Toss Chose To Bat Will Beat India Icc World Cup 2023
Icc odi world cup 2023: బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా..ఇండియాను ఓడిస్తుందా?
ప్రస్తుతం జరుగుతున్న ODI ప్రపంచ కప్‌లో భారత్ విజయాల పరంపరతో జోరుమీదుంది. ఈ క్రమంలో నేడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న 17వ మ్యాచులో ఇండియా గెలుస్తుందా లేదా అనేది చూడాలి. మరోవైపు రెండు మ్యాచులు ఓడిన బంగ్లా జట్టు ఇది తప్పక గెలవాలని చూస్తోంది.
bangladesh won toss chose to bat will beat india icc world cup 2023
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో నేడు భారత్(bharat), బంగ్లాదేశ్(bangladesh) జట్ల మధ్య 17వ మ్యాచ్ పూణెలో జరుగుతోంది. అయితే బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు గాయం కారణంగా కెప్టెన్ షకీబ్ వారి జట్టు నుంచి తప్పుకున్నాడు. శాంటో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నాల్గవ గేమ్‌లో భారత్ తలపడుతుండగా..ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇక పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉండగా..వరుస పరాజయాల నుంచి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు మొదటి ప్లేసులో ఉన్న ఇండియా తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. గతంలో ప్రపంచ కప్ వేదికపై బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు మ్యాచులలో మూడింటిలో భారత్ విజయం సాధించింది. ఏకైక ఓటమి 2007లో జరిగింది.
భారత జట్టులో రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్ ఉన్నారు.