IPLలోని పలు ఫ్రాంఛైజీల తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండానే, లోకల్ టోర్నీల్లో రాణించిన ప్లేయర్లపై కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నాయని విమర్శించాడు. వారంతా కేవలం ‘వన్ మ్యాచ్ వండర్స్’గా మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల పూర్తి సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేయాలన్నాడు.