అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో శాంసన్, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వన్ డౌన్లో సూర్య, ఆ తర్వాత స్థానంలో తిలక్ బ్యాటింగ్కు రావొచ్చు.