తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంయిపుల విషయమై రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొన్నారని 2014లో టీడీపీలో గెలిచిన తలసానిని మంత్రిని చేశారని అన్నారు. ఇక 2018 వరకు ఫిరాయింపులే ఉన్నాయని పేర్కొన్న ఆయన 2018 ఎన్నికల్లో 88 మందిని గెలిపించారని అయినా ఫిరాయింపులు చేశారని అన్నారు. 2019 నుండి ఫిరాయింపులు కొనసాగించారన్న రేవంత్ రెడ్డి పాత నేరగాళ్లు ఎలాగైతే నేర ఆలోచన మారుకోరో… kcr కూడా అలాగే ఫిరాయింపులు కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేతగా భట్టిని నియమించిందని, ఒక దళిత నాయకుణ్ణి సీఎల్పీగా ఓర్వలేని కేసీఆర్..ఎమ్మెల్యేలను కొన్నాడని అన్నారు.
బుద్ధి మారని కేసీఆర్.. 12 మందిని వివిధ సందర్భాల్లో చేర్చుకున్నారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై సీఎల్పీ నుంచి ఫిర్యాదు చేశారని అయితే అప్పుడే 12 మందిని విలీనం చేస్తున్నట్లు స్పీకర్ నిబంధనలు ఉల్లంఘించి బులిటెన్ ఇచ్చారని అన్నారు.
స్పీకర్..ట్రిబ్యునల్ లాంటి వ్యక్తి, న్యాయంగా స్పీకర్ వ్యవహరం చేయాలి కానీ అలా చేయలేదని అన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితకి మంత్రి పదవి ఇచ్చారని, సుధీర్ రెడ్డికి మూసీ రివర్ కార్పొరేషన్ పదవి, రేగా కాంతారావుకి విప్ పదవి ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయింపులు పాల్పడిన వారు లబ్ధి పొందారని, పైలెట్ రోహిత్, హర్షవర్ధన్లు హ్యాబిచువల్ అఫెండర్స్ గా మారిపోయారని అన్నారు. అందుకే బీజేపీకి అమ్ముడు పోవడానికి సిద్ధం అయ్యారని అన్నారు.