VZM: JNTU–గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంలో మెరా యువ భారత్ సహకారంతో జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యువజన పార్లమెంట్–2026’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. యువతే దేశానికి ప్రధాన శక్తి అని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. నేటి యువతే రేపటి నాయకులన్నారు.
NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 7 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం జరిగిన గణితం, రాజనీతి, వృక్షశాస్త్రం పరీక్షలకు మొత్తం 1,867 మందికి గాను 1,796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామ్ రెడ్డి తెలిపారు.
MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు ఎదురుకుంటున్న అంగన్వాడీ టీచర్ వరలక్ష్మిపై సోమవారం సర్పంచ్ సింగతి రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమయపాలన పాటించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి బోధన చేస్తూ అలరించారు. పాఠశాల ఛైర్మెన్ పట్ల మౌనిక జనార్ధన్, హెచ్‌ఎం ఆర్.వెంకన్న, ఉపాధ్యాయుడు బి.యాదయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల ప్రతిభను అందరూ అభినందించారు. ఈ వేడుక విద్యార్థుల్లో బాధ్యతను పెంచినట్లు వారు తెలిపారు.
సత్యసాయి: రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా పెనుకొండ–ధర్మవరం మధ్య 42 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన మక్కజిపల్లి–ధర్మవరం మధ్య 30.04 కిలోమీటర్ల సెక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. పెనుకొండ–ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
PLD: నరసరావుపేట మండలం ములకలూరులోని ముస్లిం మైనార్టీ కళాశాల, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ భవనాలను ఇతర విభాగాలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాల కోసం వీటిని వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ATP: మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్వ వైభవంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.
BPT: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కర్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ ఉమామహేశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. 2025లో కర్లపాలెం అయ్యప్ప స్వామి గుడి వద్ద జరిగిన చోరీ కేసులో గుంటూరుకు చెందిన అఖిల్, రాజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
SRCL: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 127 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, సీఈసీ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్, బైపీసీ విద్యార్థులకు బోటనీ పరీక్ష నిర్వహించగా, మొత్తం 4764 మంది విద్యార్థులకు గాను 4637 మంది హాజరైనట్లు అధికారులు వివరించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
W.G: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు స్పష్టం చేశారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో అంగన్వాడీల్లో 70 శాతం ఉన్న హాజరు, ప్రస్తుత ప్రభుత్వ చొరవతో 90 శాతానికి పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
HYD: గ్రేటర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా హైడ్రా ముందుకు కదులుతోంది. దీంట్లో భాగంగా బుమూక్ దౌల, కూకట్‌పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ చెరువులను ప్రారంభించేందుకు HYDRAA సన్నహాలు చేస్తోంది. వీటితోపాటు మరో 13 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కాగా వీటికి రూ.303 కోట్లు అవసరం.
జీడిపిక్కలకు ప్రభుత్వం రూ. 200 మద్దతు ధర ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ రాయవరం మండలం వేమగిరిలో ఉపాధి కూలీలతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వమే జీడిపిక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్న ప్రభుత్వం జీడిపిక్కలకు ఎందుకు ప్రకటించడం లేదన్నారు.
కడప నగర శివారులోని 27వ డివిజన్ రిజ్వాన్ నగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజ్, వాటర్ పైప్‌లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధుల ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.1.12 కోట్లు విడుదల కాగా, ఎంపీ లాడ్స్ కింద రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులు, రూ.4 లక్షలతో పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.
MBNR: జిల్లాలో హోలీ పండుగ తేదీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 3న చంద్రగ్రహణం ఉండటంతో, ఒక వర్గం మార్చి 4న రంగుల హోలీ జరుపుకోవాలని భావిస్తుండగా.. యువత రేపే జరుపుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణం సాయంత్రం 6:47కు ముగియటంతో పెద్దలు శుభకార్యాలు ఆ తర్వాత చేయాలని సూచించి గందరగోళం నెలకొంది.
JN: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ కలిశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ఏకతాటిపైకి తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు జిల్లా అధ్యక్షురాలు తెలిపారు.