NTR: తిరువూరులోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.
NDL: ప్యాపిలిలోని CPI కార్యాలయంలో గురువారం పట్టణ కార్యదర్శి వెంకటేశ్, మండల కార్యదర్శి మహేశ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. వారు గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని, అధికారులు ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని సీపీఐ నాయకులు కోరారు.
HYD: రహమత్ నగర్ డివిజన్‌లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. డివిజన్‌లో సీసీ రోడ్ల పనులు, రహమత్ నగర్ జంక్షన్ విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. 28న కల్యాణోత్సవం, మార్చి 10న ప్రధాన ఘట్టమైన తేరు నిర్వహించనున్నారు. ప్రహ్లాద సమేతుడై కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మార్చి 13న పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
అన్నమయ్య: గాలివీడు(మం) గుండ్లచెరువు గ్రామ కస్పాలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామాలయానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో.. మేకర్స్ టీజర్‌ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండానే అనుమతి ఇచ్చారని మండిపడింది. కేరళ స్టోరీ-2 సినిమాపై హైకోర్టు స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రం నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌ను కూడా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
KDP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. గురువారం సిద్ధవటం(మం) మూలపల్లెలో నూతనంగా నిర్మించిన 4 ‘గోకులం’ షెడ్లను ఆయన ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోకులం షెడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చమర్తి కొనియాడారు.
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ ఆశలు సౌతాఫ్రికా విజయంపై ఆధారపడి ఉన్నాయి. సౌతాఫ్రికా ఓడితే భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా సెమీస్ చేరుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే సఫారీలను ఓడించడం జింబాబ్వేకు అంత సులభం కాదు.
కృష్ణా: గుడివాడలో జనసేన కార్యాలయంలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు పోస్టర్‌ను జిల్లా కార్యదర్శి గంగాధర్ గురువారం ఆవిష్కరించారు. జనసేన ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారని అన్నారు. సభ్యత్వ నమోదు కోసం ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, ఒక ఫోటో రూ. 400 తీసుకురావాలని కోరారు.
JGL: రాయికల్ మండలంలోని రామాజీ పేట్ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన సుమారు 650 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులతో కలిసి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.
BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పర్యటించారు. ముందుగా గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ సర్పంచ్ భూక్యా సరితా సుధాకర్ ఉప సర్పంచ్ కుక్కల ముత్యాలరావు గ్రామ శాఖ అధ్యక్షులు బోగిన బోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివో భవనాన్ని శంకుస్థాపన చేశారు.
KMR: బీర్కూరు మండలంలోని బరంగు ఏడిగి గ్రామంలో గురువారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 142 మందికి పరీక్షలు చేయగా, 37 మందికి మోతిబిందు సమస్య ఉన్నట్లు వైద్య సహాయకులు అజయ్, రాకేశ్ తెలిపారు. వీరికి బోధన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, సర్పంచ్ అనిల్, హనుమంతరావు పాల్గొన్నారు.
MDK: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన బ్యాగరి రాకేశ్ జాతీయ స్థాయి కెమిస్ట్రీ పోటీ పరీక్షలో 98వ ర్యాంక్ సాధించి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్యాట సరిత ఆయనను సన్మానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.