KMM: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిర్లాపురం సర్పంచ్ వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు ఎకరాకు రూ. 40వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మీపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని BRS జిల్లా నాయకులు సరస్వతీ డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగకుండా మంత్రి వివేక్ BRS నాయకులు సుమన్, MLA కోవ లక్ష్మీలపై తప్పుడు కేసులు పెట్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలు తీర్పును ప్రభుత్వం శిరసావహించి ఎన్నిక నిర్వహించాలన్నారు.
KDP: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు దాటుతున్న సుమారు 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడిని కడప రోడ్డునుంచి వేంపల్లె వైపు వెళ్తున్న ట్రిప్పర్ ఢీకొట్టింది.ఘటనను గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయగా,వాహనాన్ని ఆపి వృద్ధుడిని బయటకు తీశారు.తలకు తీవ్ర గాయాలైన వృద్ధుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
NDL: మహానంది దేవస్థానంలో ఈనెల 27న హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయస్వామి, కోదండ రామాలయం, అన్నప్రసాద విభాగం గో సంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకల లెక్కింపు ఉంటుందన్నారు. సిబ్బంది అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఐదేళ్ల బాలుడు వెంకట్ మృతిచెందాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతితో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది.
WG: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
TG: ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షలు, 204 సెల్‌ఫోన్లు, 141 సిమ్‌లు, అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్‌టాప్‌లు జప్తు చేశామని తెలిపారు.
NTR: నందిగామలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్లిన కుటుంబంపై దాడి చేసి చిన్నారిని తొక్కడం అమానుషమని ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు.
అన్నమయ్య: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పెద్దమండ్యం మండల అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ CITU, IFTU ఆధ్వర్యంలో తంబళ్లపల్లె ICDS ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలన్నారు.
విశాఖలోని Andhra Medical Collegeకు యూకేలో స్థిరపడిన డాక్టర్ ఐ.కే. రాజు యూరాలజీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు విరాళంగా అందజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి సమక్షంలో డీజే స్టెంట్లు, గైడ్ వైర్లు, కాథెటర్లు అందజేశారు. ఈ పరికరాలు నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగపడతాయని విభాగాధిపతి డాక్టర్ ఐ. చంద్రశేఖర్ తెలిపారు.
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో రేపు తిరుమల లడ్డులు విక్రయించడం జరుగుతుందని టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల నుంచి లడ్డూలను తెప్పించి విక్రయిస్తామన్నారు. ఒక్కో లడ్డు రూ.50 చొప్పున విక్రయించడం జరుగుతుందని తెలిపారు.
MDCL: కీసర చుట్టూర ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా పెరిగింది. రెండు రోజులుగా ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో వేడి మరింత పెరిగినట్టుగా అనిపిస్తోంది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను కోడుమూరు సీఐ తబ్రేజ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను తనిఖీ చేసి,మండలంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని,కేసులను త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.
VZM: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమ స్థలం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
PPM: అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా పోటీలలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సత్తా చాటుతున్నారు. ఉత్సాహంగా సాగుతున్న పోటీలలో రన్నింగ్‌లో విన్నర్‌గా నిలిచారు. అలాగే తగ్గఫ్ వార్ పోటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టీంలో పాల్గొని విజయం సాధించారు. అలాగే, వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సత్తా చాటారు.