KKD: జేఎన్టీయూ నిర్వహించే ఏపీ ఈఏపీసెట్(AP-EAPSET)-2026 పరీక్షల దరఖాస్తు గడువు వివరాలను కన్వీనర్ డాక్టర్ ఎన్.మోహనరావు విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం వివిధ స్థాయిల్లో ఆలస్య రుసుములతో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సమయం ఉంటుందన్నారు.
SRCL: చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసి వేశారు. ఆలయ అర్చకులు వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం ముగిసి న అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహిం చి, ఆలయం అంతట సంప్రోక్షణ చేపట్టి, తెరుస్తామన్నారు.
హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం ‘అవరాపన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేసియాలో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుందట. దిశ, ఇమ్రాన్‌ల ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి: మండలంలోని అందుగులపల్లి గ్రామ రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉపసర్పంచ్ స్వప్న అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
MLG: హోలీ పండుగ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, అధికారులకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రసాయనిక రంగులు వాడకుండా సహజ సిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు నిర్వహించాలని కోరారు.
సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల పరిస్థితి దారుణంగా ఉంది. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తామని పెద్దలు చెబుతున్నా, వాస్తవం మాత్రం భిన్నంగా ఉందని యువ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్‌లలో స్టోరీ లిజనర్స్ కొత్త వారిని కలవడానికి ఇష్టపడరని, అపాయింట్‌మెంట్ ఇచ్చి కూడా గంటల తరబడి వెయిట్ చేయించి ఆఖరి నిమిషంలో అబద్ధాలు చెబుతారని వాపోతున్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్ కు అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో స్థానిక జయశ్రీ స్వీట్స్ అండ్ బేకరీలో ఫుడ్ ఇన్ స్పెక్టర్ రామసుందరరెడ్డి సోమవారం తనిఖీలు చేపట్టారు. ఫిర్యాదుదారు సమక్షంలోనే స్వీట్ల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ADB: భారత ప్రజారోగ్య ప్రమాణాల హామీల అమలులో భాగంగా 100 రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు. ఆదిలాబాద్ DMHO కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 4న ప్రారంభంకానున్న 100 రోజుల ఆరోగ్య కార్యక్రమాల వివరాల MLHP, MOలు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ అందించారు.
KNR: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ కరీంనగర్ మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతికి స్వస్తి పలకాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల అనుమతులు సులభతరం చేయాలని ఆయన ఆదేశించారు. నిజాయితీగా పనిచేసే వారికి అండగా ఉంటానని, హామీ ఇచ్చారు.
GDWL: గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం అని ఆలయ ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకే గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత, బుధవారం తెల్లవారుజామున 6 తెరుస్తామన్నారు.
PPM: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సీతంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీజీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు మూసివేస్తామని, తిరిగి ఆలయం శుద్ధి చేసిన తదుపరి తలుపులు తెరుస్తామని పేర్కొన్నారు. బుధవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
VZM: డెంకాడ మండలంలోని గొడిపాలెం నుంచి పేడాడ, బంటుపల్లి మీదుగా భోగాపురం వైపు వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. కొన్ని చోట్ల రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించాలని వారు కోరారు.
KRNL:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సోమవారం జరిగిన పరీక్షకు 374 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని RIO జి.లాలెప్ప తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,847 మంది విద్యార్థులకు గాను, 15,473 మంది హాజరు కాగా.. 374 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు.
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు సాగే ఈ డ్రైవ్లో భాగంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
RR: షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనతో పోలీస్ సేవలపై స్పష్టత పెరిగింది.