ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మార్కాపురంలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు లేకుండా రక్షిత మంచి నీరు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తానని, వెలిగొండ్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.
NLG: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాలలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో… మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై బృందం అధ్యయనం చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తుందని తెలిపారు.
AP: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV టీకాలు పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ చేపట్టనున్నారు. బాలికల వ్యాక్సినేషన్‌కు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. ఈనెల 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీకాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
BPT: రేపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జీవనోపాధులపై సమీక్ష జరిగింది. మహిళా సంఘాల ద్వారా తాటి బెల్లం, ఎండు చేపలు, పండ్లను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసే ప్రణాళికపై వారు చర్చించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రేపల్లె నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు కానుంది.
ASF: తమ భూమిలో సాగు చేసుకోనియకుండా అటవీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని సిర్పూర్(T) మండలం అచ్చేల్లి గ్రామస్థులు ఆరోపించారు. గత 40 ఏళ్లుగా 136 సర్వే నెం.లో సాగు చేసుకుంటున్న తమ భూమి అటవీ పరిధిలో వస్తుందని అధికారులు అబద్దాలు చెబుతున్నారన్నారు. ఈ మేరకు ఇట్టి భూములపై జాయింట్ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బుధవారం MRO కి వినతిపత్రం అందజేశారు.
ASF: కాగజ్ నగర్ మండలం కోయవాగు అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చింతపురి లక్ష్మి బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, పంపిణీలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలోని చిన్నారులందరూ కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో LM–6 కాల్వ పనుల కోసం 16వ రోజు దీక్ష కొనసాగిస్తున్న బాధిత రైతులు బుధవారం బిక్షాటనకు దిగారు. పెద్దలింగపూర్ నుంచి ట్రాక్టర్లపై వచ్చిన రైతులు, సర్పంచులు, మహిళలు దుకాణదారుల వద్ద సహాయం కోరారు. కాల్వ పూర్తి చేయడానికి రూ.3.20 కోట్లు అవసరమని, నిధులు విడుదలయ్యే వరకు పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేశారు.
PDPL: పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాసేవకు ఆకర్షితులై జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
GNTR: తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ‘రాధే’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఇతని వెనుక మంగళగిరికి చెందిన దిలీప్, శ్రీకాంత్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.10,200 నగదు, ఫోన్‌పేలో ఉన్న రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: గుడివాడ పొట్టి శ్రీరాములు హై స్కూల్ విద్యార్థులకు సీఐ హనీశ్ కుమార్, శక్తి టీం సభ్యులతో కలిసి చట్టాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల, సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు 112 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
తూ.గో: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మీ రాజమండ్రిలోని మనసా మానసిక చికిత్స కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, అందుతున్న వైద్య సదుపాయాలు తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
MHBD: తొర్రూరు పట్టణంలో తమ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని బుధవారం పాలకుర్తి వైపు ప్రయాణిస్తుండగా వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు కిందపడడంతో గాయాలపాలయ్యారు. వెంటనే వాహనం ఆపించి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని గాయపడిన వారిని పరామర్శించి, వారిని ఆసుపత్రికి తరలించారు.
కోనసీమ: అంబాజీపేట మండలం నందంపూడికి చెందిన నేదునూరి జనార్ధనరావు (55) బుధవారం కరెంటు షాక్‌తో మరణించారు. కొబ్బరి దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతుండగా కరెంటు తీగలపై పడిన ఎండుటాకు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. షాక్‌కు గురై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామస్థులు కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా’. ఈ చిత్రానికి ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ‘అనగ అనగ అమెరికా’ అనే ఫస్ట్ సింగిల్‌ను ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నెల్లూరు: సర్వేపల్లిలో హైవే పక్కన రూ. 100కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని MLA సోమిరెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘సర్వేపల్లిలో గత ఐదేళ్లు చాలా ఘోరాలు జరిగాయి. MSME పార్కు పేరుతో 50 ఎకరాలు, సూరాయపాలెంలో 30 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాల భూమిలో స్కామ్ జరిగింది. దీనిపై ఏమైనా చర్యలు మొదలె పెడితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.