• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

అనకాపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం జరిగాయి. అధ్యక్షుడిగా వడ్డాది వెంకట్రావు, ఉపాధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా శివాచారి, సంయుక్త కార్యదర్శిగా సందీప్ ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా నీలవేణి, గ్రంథాలయ కార్యదర్శిగా మోహన్, స్పోర్ట్స్ సెక్రటరీగా యోగి, మహిళా రిప్రజెంటేటివ్‌గా కుసుమను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు.

March 27, 2026 / 08:55 AM IST

ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

VZM: జిల్లాలోని అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి. గోవిందరాజులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

March 27, 2026 / 08:53 AM IST

అక్రమ తరలిస్తున్న పశువుల పట్టివేత.. కేసు నమోదు

SKLM: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని బుధవారం రాత్రి జలుమూరులోని చల్లవాని పేట వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బలద సంత నుంచి నారాయణ వలసకు 6 ఎద్దులతో వస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరి వ్యక్తులపై గురువారం కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై బి. అశోక్ బాబు పేర్కొన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేయకూడదన్నారు.

March 27, 2026 / 08:53 AM IST

శ్రీ‌రామ కల్యాణ మహోత్సవానికి మహిళలకు గోరింటాకు

BHNG: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం మహిళా భక్తులు గోరింటాకును తెంచి రోకలితో నూరారు. ముత్తయిదువలకు పసుపు కుంకుమలు పెట్టి కాళ్లకు మైదాకు పారాణి పెట్టారు.

March 27, 2026 / 08:50 AM IST

ALERT: ఏపీలో వడగాలుల హెచ్చరిక

AP: మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఇవాళ పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

March 27, 2026 / 08:50 AM IST

విధుల్లో నిర్లక్ష్యం – ఉపాధ్యాయుడు సస్పెన్షన్: కలెక్టర్

WGL: గీసుకొండ మండలం దస్రునాయక్ తండా  శివారు మంగళితండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పి. శ్రీనివాసును గురువారం కలెక్టర్ సత్యశారద సస్పెండ్ చేశారు. ఉదయం 7.45 గంటలకు పాఠశాలను సందర్శించిన కలెక్టర్, ఉపాధ్యాయుడు సమయానికి రాకపోవడాన్ని గుర్తించారు. జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

March 27, 2026 / 08:49 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

నల్గొండ పట్టణంలోని పాతబస్తీలో ప్రమాదాల నివారణకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో ప్రధాన కూడళ్లు, అంతర్గత రహదారులపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనులు చేస్తున్నామని, మరిన్ని రక్షణ చర్యలు చేపడతామని మేయర్ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 08:47 AM IST

విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

విజయవాడ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ ఆరేపల్లి దుర్గారావును అరెస్ట్ చేశారు. మచిలీపట్నానికి చెందిన అతనిపై 80 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చోరీలు చేయడంతో నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

March 27, 2026 / 08:46 AM IST

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. అలాగే, డీజిల్‌పై పూర్తిగా ఎత్తేసింది. గతంలో డీజిల్‌పై లీటర్‌కు ఎక్సైజ్ డ్యూటీ రూ.10 ఉండేది. ఈ ప్రకటనపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 08:44 AM IST

BREAKING: పెట్రోల్ ధరలు తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. అలాగే, డీజిల్‌పై పూర్తిగా ఎత్తేసింది. గతంలో డీజిల్‌పై లీటర్‌కు ఎక్సైజ్ డ్యూటీ రూ.10 ఉండేది. ఈ ప్రకటనపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 27, 2026 / 08:44 AM IST

దక్షిణ అయోధ్యగా వెలసిన సిర్సనగండ్ల క్షేత్రం

MBNR: చారకొండ మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయం ‘దక్షిణ అయోధ్య’గా ప్రసిద్ధి గాంచింది. త్రేతాయుగంలో రాముడు వనవాస సమయంలో ఇక్కడ విశ్రమించారని, అగస్త్య మహర్షి కోరిక మేరకు సీతాసమేతుడై వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా రామయ్య కళ్యాణ మహొత్సవం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు.

March 27, 2026 / 08:44 AM IST

‘బీమా ద్వారా కుటుంబానికి ధీమా లభిస్తుంది’

ASR: బీమా ద్వారా కుటుంబానికి ధీమా లభిస్తుందని కొయ్యూరు గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గణేష్ తెలిపారు. ఇటీవల సహజ మరణం పొందిన ఎం.శ్రీనివాసరావు, చెదల బంగారమ్మ కుటుంబ సభ్యులకు గురువారం రూ. 2లక్షల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి పధకంలో ఏడాదికి రూ. 436 చెల్లిస్తే, సహజ మరణానికి రూ. 2లక్షలు కుటుంబానికి అందుతుందన్నారు.

March 27, 2026 / 08:43 AM IST

నేడు అపర భద్రాద్రి మహా కల్యాణోత్సవం

NGKL: చారకొండ మండలంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి మహా కళ్యాణోత్సవం నేడు మధ్యాహ్నం 12 గంటలకి అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నలువైపుల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ అన్ని సౌకర్యాలను ఆలయ ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.

March 27, 2026 / 08:42 AM IST

అభివృద్ధి పనులకు రూ.850 కోట్లు కేటాయింపు: మంత్రి

నెల్లూరు జిల్లాలో అభివృద్ధే తమ ఎజెండాగా పని చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ గురువారం రాత్రి తెలిపారు. ఎనిమిదవ డివిజన్లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు పార్కును ఆయన ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు.

March 27, 2026 / 08:41 AM IST

హోటళ్లలో పోలీసుల తనిఖీలు

ASF: హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ల వాడకం పూర్తిగా నిషేధమని SI అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పెంచికల్ పేటలోని పలు హోటళ్లలో ఆయన తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు కేవలం కమర్షియల్ సిలిండర్లనే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే సిలిండర్లను స్వాధీనం చేసుకుని కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

March 27, 2026 / 08:40 AM IST