అనకాపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం జరిగాయి. అధ్యక్షుడిగా వడ్డాది వెంకట్రావు, ఉపాధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా శివాచారి, సంయుక్త కార్యదర్శిగా సందీప్ ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా నీలవేణి, గ్రంథాలయ కార్యదర్శిగా మోహన్, స్పోర్ట్స్ సెక్రటరీగా యోగి, మహిళా రిప్రజెంటేటివ్‌గా కుసుమను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు.