BHNG: రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని CPI చేపట్టిన ప్రచార జాత ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించబోయే మహా ధర్నా కార్యక్రమానికి రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కడప నగరంలో మహిళా సాధికారతకు కొత్త దిశగా మన కడప-చాయ్ రాస్తా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కళాక్షేత్రం పక్కన ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి ప్రారంభించారు. మహిళా సంఘ సభ్యులను అభినందించి వారి ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
PDPL: విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8న రాఘవాపూర్ డివిజన్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు టీవీఏఈజేఏసీ జిల్లా కన్వీనర్ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్, పీఆర్సీ-2026 అమలు చేయాలని ఆదివారం డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపే యాజమాన్య తీరుకు నిరసనగా అందరూ ధర్నాలో పాల్గొనాలన్నారు.
SKLM: వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలు, నిరంకుశత్వ పాలనపైన ప్రజల పక్షాన మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి పేరిట ప్రజలను మభ్యపెట్టడం జరుగుతోందని, రైతుల సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి, పారదర్శకత లేకపోవడం, ఖర్చుల భారీ అంచనాలు వంటి అంశాలపై నిలదీశారు.
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి ఆదివారం టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం అక్కడనుండి నిడమర్రులో జరగనున్న టీడీపీ ఆవిర్భావ సభా ప్రాంగణానికి ర్యాలీగా తరలి వెళ్లారు.
HNK: బీజేపీ పార్టీకి కార్యకర్తలే అసలైన పట్టుకొమ్మలు అని మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. హంటర్ రోడ్డులో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో పద్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘ఆత్మనిర్బార్ భారత్’ లక్ష్యసాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తూ సమిష్టిగా ముందుకు సాగాలని, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
MNCL: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్ధం ఆపాలని సీఐటీయూ అనుబంధ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు డిమాండ్ చేశారు. ఆదివారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో భారత దేశ ప్రజలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌కు ఇబ్బంది పడుతున్న ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
సత్యసాయి: సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఆదివారం ప్రారంభించారు. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సహకారంతో ఆరు వెంటిలేటర్లు, మూడు ఎలక్ట్రో సర్జికల్ యూనిట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్ అందుబాటులోకి తెచ్చారు.పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
AP: మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఇప్పటి వరకు 75 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. R&R కాలనీ, మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఉప్పునీరు, రోడ్లు, పాఠశాల సమస్యలు పరిష్కరించామన్నారు. నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించామని పేర్కొన్నారు.
GDWL: ఓటు హక్కు ఆయుధాన్ని చేతబట్టి, మన సమస్యలకు మనమే పరిష్కారం వెతుక్కోవాలి అని బీఎస్పీ గద్వాల జిల్లా అధ్యక్షుడు గద్దెపాగ మణికుమార్ అనారు. ఆదివారం ఇటిక్యాల మండల కేంద్రంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలను గాలికొదిలేసి, కేవలం ఉచిత హామీలతో ప్రజలను వంచిస్తున్నాయన్నారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక (PGRS)తో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
E.G: స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీఠ వేసిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: మంత్రాలయం మండలం బూదురు గ్రామంలో బహుజన సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ న్యాయ వ్యవస్థ తీర్పులు, పెండింగ్ కేసులపై ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు అని పేర్కొంటూ.. రిజర్వేషన్ అంశాలపై పునర్విమర్శ అవసరమన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి వేగం పెంచాలని, కోర్టుల్లో పారదర్శకత, వార్షిక నివేదికలు విడుదల చేయాలని ఆయన కోరారు.
NGKL: కల్వకుర్తి మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల కేటాయింపుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ADB: గ్రామీణ మహిళలకు విద్యపై అవగాహన, విద్యాభివృద్ధి కోసం NIOS పరీక్షా ఎంతో అవసరమని డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్ అన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని గోండుగూడ TWPS పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో APM జాడి రాజారామ్, SHG సభ్యులు, తదితరులున్నారు.