• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గవర్నర్‌ను కలిసిన చేనేత కళాకారుడు

సిరిసిల్ల నేత పరిశ్రమ, కార్మికుల పరిస్థితి తెలుసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని గవర్నర్ శివ ప్రకాశ్ శుక్లా తెలిపినట్లు చేనేత కళాకారుడు హరిప్రసాద్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇవ్వాళ రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు వెదురుతో చేసిన మరమగ్గం జ్ఞాపికను ఆయనకు అందజేశారు.

March 27, 2026 / 09:13 AM IST

సబ్ జైలును సందర్శించిన విజిటర్స్ కమిటీ సభ్యులు

VZM: బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ కమిటీ సభ్యులు గురువారం బొబ్బిలి సబ్ జైలును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలతో ADJ జడ్జి ఎస్‌.దామోదరరావు, జిల్లా లీగల్‌ సర్వీస్‌ సెక్రటరీ కృష్ణప్రసాద్‌, బొబ్బిలి జడ్జిలు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఖైదీల్లో సత్ప్రవర్తన రావాలని కోరారు. తెలిసి తెలియక చేసిన తప్పులను సరి చేసుకోవాలని సూచించారు.

March 27, 2026 / 09:12 AM IST

‘రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 1000 కోట్లు’

PDPL: రాజీవ్ యువ వికాసం పథకానికి 2023- 24, 2025 -26 సంవత్సరాలకు రూ. 1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. అతి త్వరలో 33 జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పథకాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు.

March 27, 2026 / 09:12 AM IST

నవధాన్యాల అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ వీరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఉదయాపూర్వమే అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.

March 27, 2026 / 09:10 AM IST

ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం ‘సీతారాములు’

శక్యా లోభయితుం నాహమైశ్వర్యేణ ధనేన వా! అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా॥ అనే ఈ శ్లోకాన్ని రావణాసురుడితో సీతమ్మ పలికిందట. ‘ఎట్టి ధనాశలకు గానీ, ఐశ్వర్యాది ప్రలోభాలకు గానీ నేను లొంగేదానిని కాను. సూర్యుడి నుంచి కాంతి వేరుకానట్టుగా శ్రీరాముడి నుంచి నేను వేరుగాను’ అని చెబుతుంది సీతమ్మ. ‘నీకు తెలియక సీతారాములు ఇద్దరు అని భ్రమిస్తున్నావు. మేమిద్దరం ఒకటే’ అని అంటుందట.

March 27, 2026 / 09:10 AM IST

ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలి: సీఎండీ

HNK: హన్మకొండ నగరంలో వేసవి నేపథ్యంలో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్ల గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి అన్నారు.

March 27, 2026 / 09:09 AM IST

నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడు పోగొట్టుకున్న నగదును ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నిజాయతీగా తిరిగి అప్పగించారు. అమ్మవారు ఆలయ మహాద్వారం సెక్యూరిటీ స్కాన్ వద్ద చెన్నైకి చెందిన తులసి దాస్ భక్తుడు నగదు బ్యాగును పోగొట్టుకున్నారు. దానిని కానిస్టేబుల్ రమేశ్ గుర్తించి, బ్యాగులోని గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ భక్తుడికి అందజేశారు.

March 27, 2026 / 09:09 AM IST

రామాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న రామాలయాలు, హనుమాన్ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని జన్నారంలోని రామాలయం, మందపల్లిలోని సీతారామ స్వామి వారి దేవాలయం, హనుమాన్ దేవాలయాల్లోని స్వామివార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆయా దేవాలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు.

March 27, 2026 / 09:08 AM IST

భారీ హంగులతో సల్మాన్‌ కొత్త చిత్రం?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందట. దీని కోసం ముంబైలోని SRPF గ్రౌండ్‌లో ఒక భారీ సెట్‌ను (మినీ సిటీలా) నిర్మిస్తున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చిత్రబృందం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు టాక్.

March 27, 2026 / 09:06 AM IST

తై బజార్ వేలం వాయిదా: మున్సిపల్ కమిషనర్

WNP: పురపాలిక పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వారాంతపు సంత, జంతువధశాల వేలం గురువారం నిర్వహించాల్సి ఉండగా సరిపడా దరఖాస్తులు రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వేలం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

March 27, 2026 / 09:05 AM IST

‘విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి’

VKB: విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పర్వతాలు అన్నారు. కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఎక్స్ ఫ్లోరింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఇన్ మెథడాలజీ’ అనే అంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డా.బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

March 27, 2026 / 09:04 AM IST

మహేశ్వరంలో నూతన బార్ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

RR: మహేశ్వరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రిటర్నింగ్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, జి.అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా పి. శ్రీపాల్ రెడ్డి, తదితరులు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా పి.అశోక్, ట్రెజరర్‌గా జి.మల్లేశ్, లైబ్రేరియన్‌గా కే.సాయికిరణ్ ఎన్నికయ్యారు.

March 27, 2026 / 09:03 AM IST

గుర్రంపేటలో సీతారాముల కళ్యాణానికి సిద్ధం

BHPL: భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేకంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయం నుంచే భక్తులు దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని వారు కోరారు.

March 27, 2026 / 09:03 AM IST

తుంగతుర్తి మండలంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

SRPT: ఎమ్మెల్యే మందుల సామేలు నేడు తుంగతుర్తి మండల కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వేడుకను విజయవంతం చేయాలని అధికారులు, నిర్వాహకులు కోరారు.

March 27, 2026 / 09:03 AM IST

బియ్యం వ్యాపారి ఇంట్లో తనిఖీ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు బృందం

NLG: మిర్యాలగూడ పట్టణంలో బియ్యం వ్యాపారి ఇంట్లో గురువారం ఢిల్లీలోని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బృందం తనిఖీ కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ళ గోపి ఇంట్లో, వ్యాపార కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రతినిధులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

March 27, 2026 / 09:01 AM IST