• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాంగ్రెస్ పార్టీ కమిటీలు రద్దు.

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. ఈ నెల 31లోగా మండల కమిటీలు, ఏప్రిల్ 15లోగా బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నగరంలోని డివిజన్ కమిటీల ఎంపిక మంత్రి కొండా సురేఖ రాక తర్వాత ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

March 27, 2026 / 09:36 AM IST

నర్సాపురంలో నేడు విద్యుత్ ప్రభ..!

ప్రకాశం: మర్రిపూడి మండలం నరసాపురంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నేడు విద్యుత్ ప్రభను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కోదండ రామస్వామి తిరుణాల సందర్భంగా ప్రభను ఏర్పాటు చేయనున్నారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు గమనించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.

March 27, 2026 / 09:35 AM IST

వైభవంగా సీతారాముల కళ్యాణం

ADB: బేల మండలం గూడ గ్రామంలోని రామాలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకిని అందంగా ముస్తాబు చేసి కాషాయ జెండాలు పెట్టుకుని గ్రామ పురవీధుల గుండా శ్రీరాముని పల్లకి సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. మధ్యాహ్నం సీతారాముల కళ్యాణంవైభవంగా చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

March 27, 2026 / 09:34 AM IST

మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

PLD: మీడియా ప్రతినిధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ శిబిరం రేపు ఉదయం 9 గంటలకు నరసరావుపేటలోని యూపీహెచ్సీ బాబాపేటలో నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

March 27, 2026 / 09:34 AM IST

యమధర్మరాజు నాటికతో సందేశాత్మక హెచ్చరిక

జగిత్యాల ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నిర్వహించిన యమధర్మరాజు నాటిక ఆకట్టుకుంది.

March 27, 2026 / 09:34 AM IST

ఉరుకుంద హుండీ ఆదాయం ఎంత అంటే.!

KRNL: కౌతాళం మండలం ఉరుకుందలోని శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు గురువారం జరిగింది. ఈవో వాణి ఆధ్వర్యంలో స్వామివారి హుండీ ఆదాయం రూ.1,09,91,864 నమోదైంది. అన్నదాన హుండీకి రూ.10,71,889 లభించింది. భక్తులు 18.2 గ్రాముల బంగారం, 11.4 కేజీల వెండిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కమలాకర్, అర్చకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 09:33 AM IST

అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

AP: కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారి సుద్ద వాగు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 27, 2026 / 09:33 AM IST

జమ్మిచేడు జమ్మలమ్మ అద్భుత రూపం

గద్వాల జిల్లా సమీపంలో వెలిసిన జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, నూతన వస్త్రాలు, వివిధ రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. శ్రీరామనవమి పండుగ వాతావరణంలో జమ్మిచేడు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మార్మోగుతోంది.

March 27, 2026 / 09:32 AM IST

సీతారామాంజనేయుల సైకత శిల్పం

కరీంనగర్‌లోని మార్కండేయ నగర్ బతుకమ్మ గ్రౌండ్‌లోని సీతారామాంజనేయ దేవాలయంలో సీతారాముల కల్యాణ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను అలరిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత రేవెల్లి శంకర్ ఈ అద్భుత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో కమిటీ అత్యంత శ్రద్ధతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ శిల్పాన్ని తిలకిస్తున్నారు.

March 27, 2026 / 09:32 AM IST

నిషేధిత గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఫోకస్

MDCL: ఉప్పల్, మల్లాపూర్, కుషాయిగూడ ప్రాంతాల్లో నిషేధిత గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులతో కలిసి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ గుట్కా నిల్వలు, అక్రమ మద్యం సరఫరాను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 27, 2026 / 09:32 AM IST

అధ్వానంగా మారిన శ్రీకాకుళం పుణ్యపు వీధి రోడ్లు

శ్రీకాకుళంలోని రైతు బజార్ సచివాలయం పరిధిలో పుణ్యపు వీధి రహదారులు అధ్వానంగా మారాయి. అనేకచోట్ల కాలువ మీద పలకలు పాడైపోవడంతో రహదారి మీద వాహనదారులు ప్రయాణించడానికి అవస్థలు పడుతున్నామంటున్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానికులు పలుమార్లు తీసుకువెళ్లినా తగిన రీతిలో సమస్యను పరిష్కరించటం లేదని అంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

March 27, 2026 / 09:30 AM IST

శక్తి యాప్‌పై మహిళలకు విసృత అవగాహన

NLR: జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌పై పోలీస్ యంత్రాంగం గురువారం సాయంత్రం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రతి మహిళా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆపద సమయంలో సహాయం పొందడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

March 27, 2026 / 09:30 AM IST

విజయ్‌పై వ్యాఖ్యలు.. స్పందించిన సముద్రఖని

నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై సముద్రఖని స్పందించాడు. ‘కార్మేని సెల్వం’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్‌కు మొదట మద్దతు ఇచ్చింది నేనే, అందుకే ఆయన నిర్ణయంపై నా బాధను వెలిబుచ్చాను. నా మాటలను ఎవరో మధ్యలో రికార్డ్ చేసి తప్పుగా చూపారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా నా మనసులోని మాటను దాచుకోకుండా చెప్పాను’ అని క్లారిటీ ఇచ్చాడు.

March 27, 2026 / 09:30 AM IST

‘ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దు’

NRML: వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్‌పై సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు పానిక్ బయ్యింగ్‌కు పాల్పడవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలకు అవసరమైన ఇంధన వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.

March 27, 2026 / 09:29 AM IST

జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ

ASF: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

March 27, 2026 / 09:29 AM IST