NRML: వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్పై సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు పానిక్ బయ్యింగ్కు పాల్పడవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలకు అవసరమైన ఇంధన వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.