కరీంనగర్లోని మార్కండేయ నగర్ బతుకమ్మ గ్రౌండ్లోని సీతారామాంజనేయ దేవాలయంలో సీతారాముల కల్యాణ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను అలరిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత రేవెల్లి శంకర్ ఈ అద్భుత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో కమిటీ అత్యంత శ్రద్ధతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ శిల్పాన్ని తిలకిస్తున్నారు.