• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోత్కూరులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రలో శ్రీరామనవమి వేడుకలను డప్పు చప్పులతో, మహిళల కోలాట ఆటపాటలతో, డీజే సౌండ్లతో ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సీతారాముల ఊరేగింపును మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ముఖ్య నాయకులు, పట్టణ పెద్దలు, యువకులుతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

March 27, 2026 / 09:49 AM IST

వసుదైక కుటుంబానికి నిదర్శనం ఏయూ: కలెక్టర్

Vsp: ఏయూ వసుదైక కుటుంబ భావనకు ప్రతీకగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం ఏయూ అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనమని చెప్పారు.

March 27, 2026 / 09:47 AM IST

బచ్చన్నపేట నుంచి జగద్గిరిగుట్టకు 2 మెట్రో సర్వీసులు

JN: బచ్చన్నపేట ప్రయాణికులకు జనగామ డిపో మేనేజర్ స్వాతి గుడ్ న్యూస్ తెలిపారు. బచ్చన్నపేట నుంచి జగద్గిరిగుట్ట వరకు ప్రతిరోజు 2 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఈ సర్వీసులు పోచన్నపేట, కొలనుపాక, ఆలేరు, భువనగిరి, JBS మీదుగా ప్రయాణిస్తాయని చెప్పారు. ఉదయం 7:20, 7:50 గం.కు, మధ్యాహ్నం 2:35, 3:05 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

March 27, 2026 / 09:46 AM IST

‘గిరి ప్రాంత పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది’

ASR: ఎల్-నినో కారణంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో గిరి ప్రాంత పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. గురువారం ఎల్-నినో వాతావరణ ప్రభావం, ముందస్తు చర్యలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచించారు.

March 27, 2026 / 09:46 AM IST

మైలవరంలో రోడ్డుపై రొచ్చు

NTR: మైలవరంలోని బంధగార రోడ్డులో శ్రీరాముల వారి ఆలయం వద్ద వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ రోడ్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది వివాదాలకు దారి తీసే విధంగా కాలువలోని బురదను తీసి అన్నదానం జరిగే చోట వేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 27, 2026 / 09:45 AM IST

నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చరణ్‌కు చిరు విషెస్

మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ్యత, దైవచింతన నీపై నా ప్రేమను మరింత పెంచుతున్నాయి. దేవుడి దీవెనలతో నువ్వు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి’ అని పేర్కొన్నారు.

March 27, 2026 / 09:45 AM IST

శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు: బాలకృష్ణ

తెలుగు వారందరికీ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని నశింపజేసి.. ధర్మాన్ని ప్రతిష్టింపజేయడానికే శ్రీరామ అవతారం అని గుర్తుచేశారు. కష్టాలొచ్చినా ధర్మానికే నిలబడిన శ్రీరాముడు మనందరికీ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో సర్వశుభాలు, సంతోషాలు కలగాలని కోరుకున్నారు.

March 27, 2026 / 09:45 AM IST

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

VSP: పెందుర్తి పరిధిలో ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసిన నిందితుడు చందాక రాంబాబుకు జిల్లా మహిళా కోర్టు జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. కొత్త భవనాల వద్ద కాపలా ఉన్న వృద్ధ దంపతులతో పాటు మరో వృద్ధురాలిని నిందితుడు హత్య చేసినట్లు విచారణలో రుజువైంది. శిక్షతో పాటు రూ.30,000ల జరిమానా, బాధితులకు లక్ష రూపాయల పరిహారం ప్రకటించింది.

March 27, 2026 / 09:44 AM IST

‘జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించే లక్ష్యంతో పని చేయాలి’

NRPT: ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వేలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించేలా పని చేయాలని డీఈవో గోవిందరాజు అన్నారు. నారాయణపేటలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శిక్షణపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. సర్వేకు అన్ని యాజమాన్య పాఠశాలలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

March 27, 2026 / 09:43 AM IST

ఘనంగా శ్రీ హమాల్వాడి సాయి బాబా జన్మ దిన వేడుకలు

నిజామాబాద్ నగరంలోని హమాల్‌వాడిలో ఉన్న శ్రీ సంతోషిమాత సాయి బాబా దేవాలయంలో శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సాయిబాబాకు అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 7:45 గంటలకు ధ్వజారోహణం, ఉదయం 8 గంటలకు డోలారోహణం, శ్రీ సాయిబాబా జన్మదిన వేడుకలు జరిపారు.

March 27, 2026 / 09:40 AM IST

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

ATP: గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సతీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్‌లై‌న్ ద్వారా ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎమ్ఎసీ, గ్రూపుల్లో ప్రవేశాలు పొందవచ్చునన్నారు.

March 27, 2026 / 09:40 AM IST

మహనీయుడు శ్రీరాముడు: లక్ష్మణ్ బాబు

MLG: జిల్లా ప్రజలకు BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడు మన భారత సంస్కృతి, హిందుత్వం యొక్క శాశ్వత చిహ్నం అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీరాముడు అని, శ్రీరామనవమి సందర్భంగా మనం కూడా ధర్మం మార్గంలో నడుస్తూ సంస్కృతిని కాపాడుకుందాం అన్నారు

March 27, 2026 / 09:39 AM IST

ఆదర్శ దంపతులు.. ఇద్దరు కాదు ఒక్కరే!

TG: సీతారాములు ఒకే ఆత్మగా మసిలిన ఆదర్శదంపతులు. వారు ఇద్దరు కాదు.. ఒక్కరే అని చెప్పడానికి రామాయణమంతా నిదర్శనమే! వారి ప్రేమానురాగాలు, దాంపత్య జీవితాన్ని గురించి బాల, అయోధ్యకాండల్లో అందంగా వివరించారు. సుందరకాండలో చాలాచోట్ల సీతారాముల ఏకత్వాన్ని, ఎడబాటులోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని, వారిద్దరూ ఒకరేనంటూ రుజువు చేసే అంశాలను ఆవిష్కరించారు.

March 27, 2026 / 09:38 AM IST

‘మూసీ వెనుక రూ. 1.5 లక్షల కోట్ల భూదంద’

HYD: మూసీ ప్రాజెక్టుపై మాజీమంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రాజెక్టుకు DPR ఉంటే వెంటనే సభ ముందు ఉంచండి, లేదంటే ప్రజలకు వాస్తవాలు చెబుతాం’ అని హెచ్చరించారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, 5 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. రూ. లక్షా యాభై వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది.

March 27, 2026 / 09:37 AM IST

సీతారాముల కళ్యాణానికి పటిష్ట భద్రత: ఎస్పీ

NGKL: జిల్లాలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. భక్తుల కోసం క్యూ లైన్లు, వెహికల్ పార్కింగ్, తాగునీరు మరియు సీసీ కెమెరాల నిఘాను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

March 27, 2026 / 09:37 AM IST