SDPT: జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బుల కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాలో రాయితీ డబ్బులు జమ చేసినా 8 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు.
దక్షిణ భారత రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ పికిల్‌బాల్ పోటీలకు వేదిక సిద్ధమైంది. బెంగళూరులోని స్పోర్ట్స్ స్కూల్‌లో ఈనెల 13 నుంచి నిర్వహించే ఈ పోటీల్లో 20 రాష్ట్రాలకు చెందిన 1400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి 55 మంది పోటీపడనున్నారు. విజేతలకు రూ.12 లక్షల నగదు బహుమతి అందజేస్తామని కర్ణాటక పికిల్‌బాల్ సమాఖ్య అధ్యక్షులు శ్రీహర్ష వెల్లడించారు.
MBNR: ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు అప్రమత్తమై నిన్న విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులైన గద్వాల జిల్లా అలంపూర్, నారాయణపేట జిల్లా కృష్ణ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమానాస్పద వస్తువులపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, షేక్‌పేట్ డివిజన్‌లో పోలింగ్ బూత్-30లో ఈవీఎం మొరాయించింది. ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. టెక్నికల్ అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు. కాగా, శ్రీనగర్‌కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్‌లో పవర్ కట్ అయినట్లు సమాచారం.
SDPT: ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్లతో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 200 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
NGKL: జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో ఈనెల 18న యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జరగనున్న యువజనోత్సవాల కరపత్రాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ యువజన సర్వీసుల శాఖ అధికారులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువకుత పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
MHBD: నరసింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో సోమవారం బూరుగండ్ల రవికి పారునంది అర్జున్‌ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్ పొడుస్తుండగా, అడ్డుకుపోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం అత్యంత తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 12°C వరకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నుంచి ఉదయం వేళ, రాత్రి పూట చలి తీవ్రత అధికంగా ఉంటుందని చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులు కూడా తమ ఓటు సద్వినియోగం చేసుకున్నారు. అలాగే, నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని మాగంటి సునీత పిలుపునిచ్చారు.
AP: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి కాంట్రాక్టును ప్రీమియర్ అగ్రీపుడ్స్ అనే సంస్థకు కట్టబెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో గతనెల చివర్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పన్న 24వ నిందితుడిగా పేర్కొన్నారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దు మార్గాలు 72 గంటలు మూసివేశారు. అలాగే, దేశంలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతోంది. తెలంగాణ జూబ్లీహిల్స్‌తోపాటు జమ్మూకాశ్మీర్‌లో 2, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది.
GDWL: జిల్లాకు కూత వేటు దూరంలో వెలిసిన జమ్మిచేడు జమ్ములమ్మ దేవస్థానంలో ఇవాళ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారికి శ్రీ సూక్త ప్రకారంగా షోడశ ఉపచార పూజలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, త్రికాల సమయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
JN: వచ్చే సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టే ప్రధానమంత్రి శ్రీవిద్యా కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నిర్వహించాలంటూ సోమవారం దేవరుప్పుల మండలంలోని అంగన్వాడీ టీచర్లు ఎంఈఓ కళావతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నిర్మల, మంగమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో పేలుడుకు కారణమైన i20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిట్టచివరి సారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ దీన్ని కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
NDL: నంది కోట్కూరులోని మార్కెట్ యార్డు నందు టీడీపీ మండల క్లస్టర్, యూనిట్, విలేజ్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం నేడు ఉంటుందని నాయకులు ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్య గిత్త జయసూర్య హాజరై, ఉదయం 10.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పాల్గొన్నాలని నాయకులు ప్రవీణ్ పిలుపు నిచ్చారు.