RR: తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేడు సెల్వార్ కూత్తుతో అంకురార్పణ జరుగనుంది. వచ్చేనెల 3 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 3న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
SRPT: నాగారం మండలం నాగారం బంగ్లాలో విద్యుత్ వైరు తగిలి రైతు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. నాగారం బంగ్లాకి చెందిన యాదయ్య (55) తన వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి తెగిపోయి పొలంలో పడ్డ విద్యుత్ వైరు కాళ్లకు తాకి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
JGL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అంగన్వాడీ టీచర్, బీఏల్టీ- 193గా పని చేస్తున్న తూకుంట్ల పద్మను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ. సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఎన్నికల పనుల్లో నిర్లక్ష్యం సహించమని స్పష్టం చేశారు. బాధ్యతగా విధులు నిర్వహించాలని అధికారులకు వారు హెచ్చరికలు జారీ చేశారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే మాధవరెడ్డి చొరవతో మార్గం సుగమమైంది. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ పనులను పరిశీలించి, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులు లేకుండా, బురద, గుంతల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి అన్నారు.
NLG: జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏ. సతీశ్ కుమార్ విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి నరసింహపై 181 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా స్వామి గౌడ్, ఏ. సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా అమరావతి, కోశాధికారిగా ఫిరోజ్, క్రీడా కార్యదర్శిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.
KNR: హుజురాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం ఉత్సాహభరితంగా జరిగాయి. అధ్యక్షుడిగా కేసరి శేషయ్య 63 ఓట్లతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా పాక జ్యోత్స్న దేవి 85 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇతర పదవులకు రాజేష్ పిట్టాల, లింగమూర్తి, మోరే కళ్యాణ్, యాస్మిన్ ఎన్నిక కాగా, నూతన కార్యవర్గాన్ని అభినందించారు.
HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మామునూరు ఏసీపీ తిరుపతి పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.
PDPL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO సూచించారు. సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీలను ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేటప్పుడు ఏఎన్ఎం వెంట వెళ్లాలని తెలిపారు. సంబంధిత కేంద్రాలలో టార్గెట్ ప్రకారం పీసీవీ వ్యాక్సినేషన్ వేయాలని, గడువు లోపు ఏన్సీడీ పూర్తి చేయాలని సూచించారు.
కోనసీమ: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠ, ఆదర్శ నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. శ్రీరాముని జీవితం మనిషి ఎలా ఉండాలో చూపించే ఆదర్శమూర్తి జీవితమన్నారు.
JN: రెండో భద్రాద్రిగ పేరొందిన వల్మిడిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు రాములవారి కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు.
ATP: అంతర్ జిల్లా జూనియర్ విభాగం బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల జట్లను ఈ నెల 28న ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ప్రతినిధులు శ్రీకాంత్రెడ్డి, నరేంద్రచౌదరి తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. జనవరి 1, 2008 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్డ్ భూముల సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీ వేస్తామన్నారు. రాష్ట్రంలో గతంలో పేదలకు సర్కారు ఎసైన్డ్ భూములు ఇచ్చిందని, ఇప్పుడవి 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో పేదవారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామన్నారు.
PPM: ఎవరైనా ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాలూరు తహసీల్దార్ సురేశ్ హెచ్చరించారు. గురువారం మామిడిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. వెంగళరాయ సాగర్ కార్యాలయం ఎదుట పలువురు ప్రభుత్వ స్థలంలో పాన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు గమనించి, తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
SKLM: టెక్కలి MLA, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు .టెక్కలి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.