• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గొర్లవేడులో సామూహిక గీతాలాపన

BHPL: “వందేమాతరం” జాతీయ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తి సందర్భంగా గ్రామ బస్టాండ్ BHPL మండలం గొర్లవేడు గ్రామంలోని అంబేద్కర్ సెంటర్‌లో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థులు, అధికారులు, విద్యార్థులు ఏకమై గీతాన్ని ఆలపించారు. మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన గీతం దేశభక్తిని రగులు కోల్పింది.

November 7, 2025 / 12:56 PM IST

ఎన్నికల సమయంలో సోదాలు చేయడం సహజం: పొన్నం

HYD: ఎన్నికల సమయంలో సోదాలు జరగడం చాలా సహజమని, అవి ఎవరి ఇంట్లో అయినా చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పని చేస్తుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సోదాలు నిర్వహించడం ఎన్నికల సంఘం యొక్క హక్కు అని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.

November 7, 2025 / 12:56 PM IST

బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి నాలుగో వార్డ్ బీసీ కాలనీలో శుక్రవారం బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, స్థానిక విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

November 7, 2025 / 12:55 PM IST

కలెక్టరేట్‌లో వందేమాతర గీతం ఆలాపన

JGL: అఖండ భారతావనికి స్వాతంత్య్ర కాంక్షను కలిగించిన వందేమాతరం గేయం నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల్లో వందేమాతరం సామూహిక గేయా ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత పాల్గొన్నారు.

November 7, 2025 / 12:51 PM IST

త్వరలో మహిళా క్రికెటర్లకు గుడ్‌న్యూస్: చిన్ని

AP: ఇవాళ కాసేపట్లో మహిళా క్రికెటర్లకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్స్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టామన్నారు. వీటితో పాటు మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేలా కీలక ప్రకటన ఉండబోతోందన్నారు.

November 7, 2025 / 12:50 PM IST

కాసేపట్లో మహిళా క్రికెటర్లకు గుడ్‌న్యూస్: చిన్ని

AP: ఇవాళ కాసేపట్లో మహిళా క్రికెటర్లకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నామని ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్స్‌కు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టామన్నారు. వీటితో పాటు మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేలా కీలక ప్రకటన ఉండబోతోందన్నారు.

November 7, 2025 / 12:50 PM IST

జాతీయ గేయం వందేమాతరం ఆలాపన

KDP: జాతీయ గేయం వందేమాతరంను బకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ మైదుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గేయం వందేమాతరం లయబద్ధంగా ఆలాపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాభవాని దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

November 7, 2025 / 12:47 PM IST

‘శ్రేష్ట’ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: ‘శ్రేష్ట’ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఉచితంగా సీటు లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

November 7, 2025 / 12:45 PM IST

‘అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు’

ASF: అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని FRO మజారుద్దీన్ అన్నారు. రేంజ్ పరిధిలోని జైనూర్‌లో శుక్రవారం ఫారెస్ట్ బీట్లను సందర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించుకోవాలన్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేసినా, కరెంటు తీగలను అమర్చినా అటవీ చట్టాల ప్రకారం శిక్షలు తప్పవన్నారు.

November 7, 2025 / 12:44 PM IST

ఎమ్మిగనూరులో రూ.1.20 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కష్టకాలంలో ఉన్న అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూ.1.20 కోట్ల చెక్కులు పంపిణీ చేసి ఆదుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

November 7, 2025 / 12:44 PM IST

జూబ్లీహిల్స్‌లో రెట్టింపు అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి

NLG: కంటోన్‌మెంట్ కంటే జూబ్లీహిల్స్‌లో రెట్టింపు అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు రహమత్ నగర్‌లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ మాట్లాడారు. BRSను నమ్మి ఓటేస్తే గోస పడతామన్నారు. అసెంబ్లీకి రాని KCR అధికారంలోకి ఎలా వస్తారని అన్నారు. 

November 7, 2025 / 12:40 PM IST

HYDలో వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు

TG: హైదరాబాద్ గన్ ఫౌండ్రీ వద్ద వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, MP లక్ష్మణ్ పాల్గొన్నారు. వందేమాతర ఉద్యమ సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిందని కిషన్ రెడ్డి అన్నారు. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు 13 నెలలు ఆలస్యమైందన్నారు.

November 7, 2025 / 12:40 PM IST

కలెక్టరేట్ లో సామూహిక జాతీయ గీతాలాపన

ASF: బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సామూహిక గానం చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. కలెక్టరేట్లో వందేమాతరం సామూహిక గీతాలాపన నిర్వహించామన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు వందేమాతరం ఆలపించమన్నారు.

November 7, 2025 / 12:40 PM IST

శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా

AP: వరల్డ్ కప్‌లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.

November 7, 2025 / 12:38 PM IST

లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు: శ్రీచరణి

వరల్డ్ కప్‌లో సమష్టిగా విజయం సాధించామని భారత క్రికెటర్ శ్రీచరణి తెలిపింది. CM చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్లు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లోకేష్ ఎంతగానో ప్రోత్సహించారు. R అశ్విన్ ప్రశంసలు మరువలేనివి. ప్రధానితో ఇంటరాక్షన్ బాగుంది’ అని తెలిపింది.

November 7, 2025 / 12:38 PM IST