అన్నమయ్య: మదనపల్లెలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను పోలీసులు వేరు చేశారని యువకుడు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశాడు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన వినోద్ కుమార్, కొత్తకోట మండలానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అయితే బి.కొత్తకోట సీఐ గోపాలరెడ్డి తమను విడదీసి యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించాడని ఆరోపించారు.