ASR: ఆదివాసీ మహిళ లక్ష్మమ్మ (లక్ష్మి) ఆంధ్ర యూనివర్సిటీలో అరకు కాఫీపై PHD చేసి, డాక్టరేట్ సాధించారు. జీ.మాడుగుల మండలంలోని గడుతూరు పంచాయతీ చిన్నపిన్నపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి తండ్రి చనిపోయినా, తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆమెను గురువారం ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు అభినందించారు.