జగిత్యాలలోని సఖీ (వన్ స్టాప్ సెంటర్)లో పారాలీగల్, లీగల్ కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ (LLB), 2 – 3 ఏళ్ల అనుభవం కలిగిన జిల్లా మహిళలు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తులు మార్చి 27 నుంచి 29 వరకు సాయంత్రం 5 గంటలలోపు స్వీకరిస్తారు.