SKLM: పలాసలోని కొంతమంది వ్యక్తులకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన నిందితులకు జైలు శిక్ష విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి మాధురి తీర్పు వెల్లడించినట్లు సీఐ వై. రామకృష్ణ గురువారం తెలిపారు. విశాఖపట్నంకి చెందిన 4గురు నిందితులకు 16 నెలల జైలు శిక్ష, రూ.4,500ల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మద్దని పేర్కొన్నారు.