E.G: గౌరీపట్నంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సొసైటీ ఛైర్మన్ ఆండ్రు అనిల్ తెలిపారు. ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుంది. కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.