VKB: బొంరాస్పేటలోని భక్త సమాజం ఆవరణలో ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పురోహితుడు జోషి సత్యనారాయణరావు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు సీతారాముల ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.