కొందరు ప్రతి ఉదయం గుడ్లను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఎంతో మంచి ఆహారపు అలవాటు అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. జీవక్రియ, రోగనిరోధక శక్తి, మెడదు పనితీరుకు మేలు చేస్తుందట. అయితే ఉదయం వేళ 2 గుడ్లకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.