ATP: తాడిపత్రికి పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రూ. 250 కోట్లతో రూపొందించిన పర్యాటక అభివృద్ధి ప్రాథమిక నివేదికను చింతల వెంకటరమణ స్వామి పాదాల చెంత ఉంచి గురువారం పూజలు నిర్వహించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి, వెంకటరమణ స్వామి ఆలయాలను ప్రధాన ఆకర్షణగా అభివృద్ధి చేస్తామన్నారు.