PPM: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి ఒక్కరోజు జైలు శిక్ష పడిందని సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు గురువారం తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వాహన తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తిని సాలూరు కోర్టులో హాజరుపరచామన్నారు. సదరు వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారని వెల్లడించారు.