• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామయ్య మహోత్సవానికి విరాళం అందజేత

SRD: పటాన్‌చెరువులో వైభవంగా జరిగే శ్రీ కోదండరామయ్య కళ్యాణ మహోత్సవానికి ట్రేడ్ యూనియన్ నాయకుడు, గురుస్వామి డాక్టర్ నర్రా బిక్షపతి పటేల్ రూ. 51 వేల విరాళం ప్రకటించారు. ప్రతి ఏటా ఈ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవా దృక్పథంతో తన వంతు సహకారాన్ని అందజేశారు. 

March 26, 2026 / 07:01 PM IST

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి: ​ ఎమ్మెల్యే

NZB: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్త తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఐటీ, మున్సిపల్ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇందూరులో నిర్మించిన ఐటీ హబ్ నిరాధరణకు గురవుతోందన్నారు.

March 26, 2026 / 07:00 PM IST

రైతుల సమస్యల మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ గండ్రాయి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. గ్రామంలో PACS పునరుద్ధరణ అవసరాన్ని వివరించారు. రవాణా ఇబ్బందులతో రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 26, 2026 / 07:00 PM IST

శ్రీరామనవమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు

GNTR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. లోకకళ్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.

March 26, 2026 / 07:00 PM IST

‘జనగణన ప్రణాళికలకు మార్గదర్శి’

ATP: జనగణన ప్రక్రియ ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పనకు మార్గదర్శిగా నిలుస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మాలోల తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఇండ్ల జాబితా, గణన ప్రక్రియపై శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు. మే 1 నుంచి 30 వరకు తొలి విడత గణన జరుగుతుందని, ఏప్రిల్ 16 నుంచి స్వీయ గణన అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

March 26, 2026 / 07:00 PM IST

జమ్మికుంట మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర

KNR: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ. 7,600 పలుకగా.. గురువారం రూ. 100 పెరిగి రూ. 7,700 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 9 వాహనాల్లో 80 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు.

March 26, 2026 / 07:00 PM IST

IPL 2026: మీ అభిమాన జట్టు ఏది?

మరో రెండు రోజుల్లో ఐపీఎల్-2026 ప్రారంభం కానుంది. గత ఏడాది ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవగా ఈ సారి పలు జట్లు విజేతగా నిలవాలని ఆరాటపడుతున్నాయి. అలాగే తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్, నితీష్ కుమార్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏది? ఏ జట్టు విజేతగా నిలుస్తుంది? ఏ క్రికెటర్ బాగా ఆడతాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

March 26, 2026 / 07:00 PM IST

పర్వతగిరి దోపిడీ కేసులో ఐదుగురికి 5 ఏళ్ల జైలు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో దోపిడీ కేసులో ఐదుగురు నిందితులకు వరంగల్ కోర్టు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రవీణ్ గురువారం తెలిపారు. మట్ట మల్లేశం ఫిర్యాదు మేరకు క్రైమ్ నం.56/2019, ఎస్సీ నం.267/2019లో కేసు నమోదు, విచారణ జరిపిన కోర్టు ఐపీసీ 395 సెక్షన్ కింద A1 నుంచి A5 వరకు నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించారు.

March 26, 2026 / 06:58 PM IST

చందనోత్సవ ఏర్పాట్లపై తనిఖీ

VSP: వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవం (మార్చి 29), చందనోత్సవం (ఏప్రిల్ 20) ఏర్పాట్లను ఈవో జల్లేపల్లి వెంకట్రావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, సౌకర్యాలు మెరుగుపర్చాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, లైటింగ్, సూచిక బోర్డులు, వాష్‌రూమ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

March 26, 2026 / 06:58 PM IST

ఒకే ఒక్క క్లిక్.. అరచేతిలో ‘భూమి’ సమాచారం!

TG: భూప‌రిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంద‌ని, గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పార‌ద‌ర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన భూభార‌తిను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

March 26, 2026 / 06:56 PM IST

ట్రాక్టర్ చోరీ కేసు.. నిందితుల రిమాండ్

NLG: నార్కట్ పల్లి మండలం దాసరిగూడెంలో చోరీకి గురైన ట్రాక్టర్‌ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు నకరేకంటి రమేష్ ఫిర్యాదుతో సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై విష్ణుమూర్తి బృందం దర్యాప్తు చేపట్టింది. ఏపీకి చెందిన మదన రవీంద్రనాథ్ రెడ్డి, ఎన్నిరెడ్డి బాపిరెడ్డిలను అరెస్ట్ చేసి, రూ. 2.50 లక్షల విలువైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, ఇవాళ రిమాండ్‌కు పంపారు.

March 26, 2026 / 06:56 PM IST

హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రామ్ పోతినేని?

యంగ్ హీరో రామ్ పోతినేని తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు విఘ్నేష్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

March 26, 2026 / 06:56 PM IST

7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ

W.G: జిల్లాలో మొత్తం 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోతకు సిద్ధమైన వరి పంటను పరిశీలించారు.

March 26, 2026 / 06:55 PM IST

శిక్షణ తరగతులలో పాల్గొన్న కలెక్టర్

BHNG: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జనగణన–2027 ఫేజ్-1 గృహాల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ తరగతుల చివరి రోజున కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, కోరారు.

March 26, 2026 / 06:53 PM IST

IPL: హోం గ్రౌండ్‌లో SRH మ్యాచ్‌లు ఇవే

ఏప్రిల్ 5 – లక్నో సూపర్ జెయింట్స్ – 3:30 PMఏప్రిల్ 13 – రాజస్థాన్ రాయల్స్ – 7:30 PMఏప్రిల్ 18 – చెన్నై సూపర్ కింగ్స్ – 7:30 PMఏప్రిల్ 21 – ఢిల్లీ క్యాపిటల్స్ – 7:30 PMమే 3 – కోల్‌కతా నైట్ రైడర్స్ – 3:30 PMమే 6 – పంజాబ్ కింగ్స్ – 7:30 PMమే 22 – RCB – 7:30 PM➟ MI, GTతో ఉప్పల్ […]

March 26, 2026 / 06:53 PM IST