• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీజ్ చేసిన ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు: ఆర్ఐ

MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గౌడి గూడెంలో ఇవాళ స్వాధీనం చేసుకున్న ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ ఇసుకను గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శికి అప్పగించినట్లు చెప్పారు. ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

March 26, 2026 / 06:01 PM IST

వేములపల్లిలో దేవాలయ హుండీ లెక్కింపు

NLG: వేములపల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర సందర్భంగా గురువారం ఉదయం దేవాలయ ఇన్‌ఛార్జ్ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, దేవాలయ ఛైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ నేతృత్వంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శాస్త్రి మాట్లాడుతూ.. 1లక్ష 20 వేల 99 రూపాయలు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

March 26, 2026 / 06:01 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 98,447

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 98,447 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 105 మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 1885 మంది అన్న ప్రసాదం స్వీకరించారని, 12 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని తెలిపారు.

March 26, 2026 / 06:01 PM IST

రోగులకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

SDPT: ఆస్పత్రి సమయ వేళలు పాటించి రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హైమవతి ఆదేశించారు. రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.

March 26, 2026 / 06:01 PM IST

‘పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి’

PLD: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాన్ బెయిలబుల్ వారంట్ల (NBWs) అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అదనపు ఎస్పీ జెవి. సంతోష్ ఆదేశించారు. నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఫిబ్రవరి–2026 నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదైన వివిధ నేరాలపై సమగ్ర సమీక్ష జరిపారు.

March 26, 2026 / 06:00 PM IST

పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి

ప్రకాశం: అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి స్వామి గురువారం విడుదల చేశారు. అడ్మిషన్లకు అంబేద్కర్ గురుకులాలకు పెద్ద ఎత్తున అప్లికేషన్ రావటం విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం విశ్వాసానికి నిదర్శనం అనే మంత్రి అన్నారు. బంగారు భవితకు నిలయాలుగా గురుకులాలు మారాయి అన్నారు.

March 26, 2026 / 06:00 PM IST

‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’ తనిఖీలు

ATP: జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, హెల్త్ అధికారి శ్రీరాములు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థల పరిసరాల్లోని దుకాణాలను తనిఖీ చేశారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని యజమానులను హెచ్చరించారు.

March 26, 2026 / 06:00 PM IST

వియంసి కార్యాలయంలో అందుబాటులో కలెక్టర్

NTR: విజయవాడ వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి మంగళ, గురువారాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చన్నారు. అలాగే కలెక్టరేట్‌లో కూడా ఎప్పుడైనా కలవొచ్చని సూచించారు. ప్రజల సౌకర్యార్థమే ఈ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

March 26, 2026 / 06:00 PM IST

అండర్-10 ఆర్చరీలో అతర్వ్ జాతీయ స్థాయికి ఎంపిక

KNR: చొప్పదండికి చెందిన కొండపాక అతర్వ్ అండర్ 10 విభాగంలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అతర్వ్‌ను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయం క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన ప్రశంసించాడు.

March 26, 2026 / 06:00 PM IST

‘మీ ఇంటికి-మీ డాక్టర్’ మొబైల్ యూనిట్ ప్రారంభం

TPT: గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘మీ ఇంటికి మీ డాక్టర్’ ప్రాజెక్టు కింద మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. రోజుకు సుమారు 100 మంది రోగులకు వైద్య సేవలు అందించనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, CSR సహకారంతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

March 26, 2026 / 06:00 PM IST

అమరావతికి చట్టబద్ధతపై కేబినెట్ కీలక నిర్ణయం

GNTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 20కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికు చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.

March 26, 2026 / 06:00 PM IST

కలెక్టరేట్‌లో ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం

CTR: స్థానిక కలెక్టరేట్‌లో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జనగణన నిర్వహణపై ట్రైనర్లకు కీలక సూచనలు చేశారు. జనగణనను క్రమబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు.

March 26, 2026 / 06:00 PM IST

శ్రీరామనవమి సందర్భంగా రేపు సెలవు

అన్నమయ్య జిల్లాలో రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూతబడతాయి. బ్యాంకులకు కూడా సెలవు వర్తిస్తుంది. అదే విధంగా 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉండనుంది.

March 26, 2026 / 05:57 PM IST

‘జెంటిల్‌మేన్’ సినిమాను వదులుకున్నా: రాజశేఖర్

శర్వానంద్ ‘బైకర్’ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించాడు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మేన్’ సినిమాలో తాను హీరోగా నటించాల్సి ఉందని వెల్లడించాడు. అయితే, అప్పట్లో కాల్‌షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

March 26, 2026 / 05:55 PM IST

రైతాంగ సాయుధ పోరాట యోధులు ధర్మ బిక్షం 15వ వర్ధంతి

NLG: తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మా బిక్షం గౌడ్ 15వ వర్ధింతిని యాదగిరిపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు ధర్మ బిక్షం గౌడ్ కీలక పాత్ర పోషించారని అన్నారు.

March 26, 2026 / 05:53 PM IST