సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ టీమ్లు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినిలకు అవగాహన కల్పిస్తున్నాయి. మహిళల భద్రత కోసం శక్తి యాప్, సైబర్ నేరాలు, డ్రగ్స్, పోక్సో చట్టాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ మధ్య తేడాలు, ఈవ్ టీజింగ్, మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు.